HomeUncategorizedSitaare Zameen Par | అమీర్ ఖాన్‌కి చిక్కులు.. రిలీజ్ అయిన ఒక రోజు త‌ర్వాత...

Sitaare Zameen Par | అమీర్ ఖాన్‌కి చిక్కులు.. రిలీజ్ అయిన ఒక రోజు త‌ర్వాత బాయ్‌కాట్ చేయాలంటూ డిమాండ్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Sitaare Zameen Par | ‘ఫారెస్ట్ గంప్’ లాంటి లార్జర్ ఈవెంట్ సినిమాను ఇండియన్ ఆడియన్స్‌కి అందించాల‌నే త‌ప‌న‌తో రీమేక్ రైట్స్ తీసుకుని చాలా డబ్బు, సమయం ఖర్చు చేసి ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా తీశాడు ఆమిర్‌ ఖాన్‌ (Aamir khan). అయితే ఆ సినిమా ఫలితం ఆయన్ని చాలా నిరాశ‌కి గురి చేసింది. ఇక కొన్నాళ్లూ సినిమాల జోలికి పోనని ఓ సందర్భంలో చెప్పారు. అయితే ఆయన్ని స్పానిష్ సినిమా ‘ఛాంపియన్స్’ ఆకర్షించింది. ఆ కథని ఆధారంగా తీసుకుని సితారే జమీన్‌ పర్‌(Sitaare Zameen Par) చేశారు. టీజర్, ట్రైలర్ ‘తారే జమీన్‌ పర్‌’ వైబ్‌ను ఇచ్చాయి. దీంతో మూవీపై అంచ‌నాలు పెరిగాయి. జూన్ 20న చిత్రం విడుద‌ల కాగా, ఈ స్పోర్ట్స్-కామెడీ డ్రామాకు మంచి రివ్యూస్ కూడా వ‌చ్చాయి.

Sitaare Zameen Par | ఇబ్బందుల్లో అమీర్ చిత్రం..

ప్ర‌స్తుతం కలెక్షన్లు కూడా బాగున్నాయి. అయితే, సోషల్ మీడియాలో ఈ సినిమాను బహిష్కరించాలంటూ (#BoycottSitaareZameenPar) డిమాండ్ రావడం గమనార్హం. సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతున్న సమయంలోనే, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ఈ సినిమాను బహిష్కరించాలని ట్రెండ్ పెరిగిపోతోంది.డబ్బులు వృధా. సితారే జమీన్ పర్ రివ్యూ చూడండి. బాలీవుడ్‌ను పూర్తిగా బహిష్కరించాలి అని ఓ నెటిజ‌న్ రాసుకొచ్చాడు. మ‌రో నెటిజ‌న్.. అమీర్ ఖాన్ త‌న సినిమా పీకేలో ఇలా అన్నాడు .. శివుడిపై పాలను పోయడం కంటే బీదవారికి సహాయం చేయాలి. ఇప్పుడు ఆయన సినిమా విడుదలైంది, కాబట్టి సినిమాను చూడడం కంటే ఆ డబ్బుతో పేదవారికి సహాయం చేయాలి అంటూ రాసుకొచ్చాడు. మ‌రో నెటిజ‌న్ .. సినిమా కొన్నిసార్లు తల్లిదండ్రుల మీద, మరికొన్నిసార్లు అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితం మీద, ఇంకొన్ని సార్లు పిల్ల‌ల‌ మీదకి మారిపోతుంది. రేటింగ్ ఒక్కటే – దారుణం. అంటూ కామెంట్ చేసింది.

హిందువులు ఎవ‌రు సినిమాని చూడొద్దని, మూవీని బాయ్‌కాట్ చేయాలంటూ పిలుపునిస్తున్నారు. ఇటీవల ఇండియా-పాకిస్తాన్‌ మద్య ఘర్షణ వాతావణం నెలకొంది. ఆ సమయంలో చాలా మంది బాలీవుడ్‌ స్టార్స్‌తో పాటు, ఇతర భాషల సినిమా తారలు పాకిస్తాన్‌(Pakistan) తీరును తప్పుబట్టడంతో పాటు, ఇండియన్‌ ఆర్మీ గురించి పాజిటివ్‌గా స్పందించారు. అంతేకాకుండా ఇండియా పై జరిగిన ఉగ్రదాడిని(Terrorist Attack) ఖండించారు. కానీ ఆమీర్‌ ఖాన్‌ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. దాంతో కనీస బాధ్యతతో వ్యవహరించని ఆమీర్‌ ఖాన్‌ సినిమాను ఇండియన్స్‌ ఎందుకు ఆధరించాలంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. సితారే జమీన్‌ పర్ సినిమా సీక్వెల్‌ కాదని, రీమేక్‌ అంటూ కూడా కొందరు బాయ్ కాట్‌ చేయాలని భావిస్తున్నారు. మొత్తానికి అమీర్ ఖాన్ సినిమా ఇప్పుడు స‌మ‌స్య‌ల‌లో చిక్కుకుంది. అమీర్ ఖాన్ గత కొన్ని సంవత్సరాలుగా చేసిన కామెంట్స్‌తో ఇప్పుడు ఇబ్బందుల్లో ప‌డ్డాడు. పీకే సినిమాలో దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలపై పెద్ద వివాదం రేగింది. అది కూడా ఇప్పుడు సినిమాని బాయ్‌కాట్ చేయ‌మ‌న‌డానికి కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు.