279
అక్షరటుడే, ఇందూరు: Boy sale in Nizamabad | నిజామాబాద్ nizamabad జిల్లా కేంద్రంలో బాలుడి విక్రయం తీవ్ర కలకలం రేపింది. నగరంలోని ఎల్లమ్మగుట్టలో ఈ ఘటన వెలుగుచూసింది. స్థానికంగా నివాసం ఉండే ఓ కుటుంబంలో కన్నతల్లి తన బిడ్డను మహారాష్ట్రలోని పుణే Pune లో రూ.2.40 లక్షలకు విక్రయించింది. పోలీసులకు బాలుడి తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Boy sale in Nizamabad | ముగ్గురి అరెస్టు
బాలుడి విక్రయాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు చేపట్టారు. మొదట తల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెతోపాటు మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. బాలుడి విక్రయం ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.