అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | తమ కుమార్తెను వేధిస్తున్నాడని ఓ బాలుడిని ఆమె కుటుంబ సభ్యులు హత్య చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్(Kushaiguda Police Station) పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. జవహర్‌నగర్(Jawaharnagar) కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్‌కు చెందిన ఎండీ రిజ్వాన్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు.
ఆయన కుమారుడు అయాన్(16) ఇటీవల పదో తరగతి పూర్తి చేశాడు. ప్రస్తుతం ఖాళీ సమయాల్లో క్యాటరింగ్ పనికి వెళ్తున్నాడు. అయితే సదరు బాలుడు ఓ బాలికను వేధిస్తున్నట్లు తెలిసింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు బాలుడిని పథకం ప్రకారం పిలిపించి.. మూకుమ్మడిగా కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అయాన్ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.