అక్షరటుడే, బాన్సువాడ: Snakebite | నస్రుల్లాబాద్ మండలంలోని సంగెం తండాలో (Sangem Thanda) పాముకాటుతో (snakebite) నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగెం తండాకు చెందిన డేగవత్ అశోక్ కొడుకు రిషికుమార్ ఇంట్లో ఆడుకుంటుండగా పాము కాటు వేసింది. దీంతో బాలుడిని హుటాహుటిన నిజామాబాద్ ఆస్పత్రికి (nizamabad hospital) తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందిన్నట్లు వైద్యులు నిర్ధారించారు.
