అక్షరటుడే, బాన్సువాడ: Banswada | విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి ఇబ్రహీంపేట్‌లో (Ibrahimpet) చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగపుత్ర కాలనీకి చెందిన దుబాయ్ సాయిలు కుమారుడు గోవర్ధన్ సాయిలు (12) ఇంటి ఆవరణలో రేకుల షెడ్డు కింద ఆడుకుంటున్నాడు. అదే సమయంలో షెడ్‌కు తగిలి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఉన్న ఒక్క కుమారుడు అకాలమరణం చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి (Banswada Government Hospital) తరలించారు.
