అక్షరటుడే, బాన్సువాడ: Varni mandal | ఈత నేర్చుకోవడానికి బావిలోకి దిగిన బాలుడు మృతి చెందిన ఘటన వర్ని మండలంలో varni mandal గురువారం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని మండలం సిద్ధాపూర్ గ్రామానికి చెందిన తాన్సింగ్(13) గ్రామ శివారులోని బావిలో తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. నీళ్లు ఎక్కువగా ఉండడంతో ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందాడు. వర్ని పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
