అక్షరటుడే, కామారెడ్డి :Palvancha | కుంటలో పడి బాలుడు మృతి చెందిన ఘటన పాల్వంచ మండలం palvancha mandal భవానిపేటలో bhavanipet village చోటు చేసుకుంది. రామారెడ్డి(Ramareddy) మండల కేంద్రానికి చెందిన దండెబోయిన అశోక్ తన కుటుంబంతో కలిసి భవానిపేట ఎల్లమ్మ ఆలయానికి (Yellamma Temple) దర్శనం నిమిత్తం వెళ్లారు. తిరిగి సాయంత్రం ఇంటికి వెళదాం అనుకునే సమయంలో నాలుగేళ్ల కుమారుడు రిత్విక్ కనిపించలేదు. చుట్టు పక్కల ఆడుకోవడానికి వెళ్లాడేమోనని అంతటా వెతికినా కనిపించలేదు. ఆలయం వెనకాల ఉన్న చెరువు వద్ద చూడగా జేసీబీ(JCB) గుంతలో రిత్విక్ శవమై కనిపించాడు. పోలీసులు(Police) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
