అక్షరటుడే, భీమ్గల్ : Bheemgal | స్కూల్ బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన భీమ్గల్ మండలంలో మంగళవారం చోటు చేసుకుంది.
ఎస్సై సందీప్ (SI Sandeep) తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కృష్ణవేణి పాఠశాల బస్సు (Krishnaveni School Bus) విద్యార్థులను తీసుకెళ్లేందుకు రహత్నగర్ గ్రామానికి (Rahath Nagar) మంగళవారం ఉదయం వచ్చింది. ఇదే సమయంలో తన అన్న స్కూల్ బస్సు ఎక్కేందుకు వెళ్తుండగా కుటుంబసభ్యులతో పాటు బస్సు దగ్గరికి వచ్చిన బాలుడు బస్సు ముందుకు వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించని డైవర్ బస్సును ముందుకు తీసుకెళ్లడంతో బాలుడు బస్సుకింద పడి అపాస్మరక స్థితికి చేరాడు. కుటుంబీకులు హుటాహుటిన బాలుడిని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.