అక్షరటుడే, ఇందూరు: Group 3 results | డొంకేశ్వర్ మండలం (Donkeshwar mandal) నూత్పల్లి వాసి గ్రూప్–3లో ఉత్తమ ర్యాంక్ సాధించాడు. ఆర్థికశాఖలో సీనియర్ అకౌంటెంట్‌గా ఉద్యోగం సాధించాడు. వివరాల్లోకి వెళ్తే.. నూత్పల్లి గ్రామానికి చెందిన శంకూరి రాజ్‌కుమార్ రెడ్డి (Shankuri Raj Kumar Reddy) ఇటీవల వెలువడిన గ్రూప్–3లో 291వ ర్యాంక్ సాధించాడు. ఈ ర్యాంక్ ఆధారంగా హైదరాబాద్‌లోని రాష్ట్ర ఆర్థికశాఖలో (State Finance Department) సీనియర్ అకౌంటెంట్‌గా ఉద్యోగం సాధించాడు.
Group 3 results | సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే..
శంకూరి రాజ్‌కుమార్ రెడ్డి రైతు కుటుంబంలో పుట్టాడు. టెన్త్, ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించాడు. అనంతరం బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడ్డాడు. అయితే సర్కారు కొలువు సాధించాలనే తపనతో ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే..సివిల్స్, గ్రూప్–1, –2 పరీక్షలక సిద్ధమయ్యాడు. అయితే అనుకున్న ర్యాంక్ రాలేదు.
Group 3 results | పట్టువదలకుండా కొలువు కొట్టాడు..
గ్రూప్–1, 2లో అనుకున్న ర్యాంక్ రాకపోవడంతో శంకూరి రాజ్‌కుమార్ రెడ్డి నిరాశ చెందలేదు. పట్టువదలకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. గ్రూప్–3కి (Group-3 exam) రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. చివరికి గ్రూప్–3లో ఉత్తమ ర్యాంక్ సాధించి ఎట్టకేలకు కొలువు సాధించాడు. ఈ సందర్భంగా ఆయనను కుటుంబీకులు, స్నేహితులు, గ్రామస్థులు అభినందించారు.