అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistan attacks with drones : ఆపరేషన్ సిందూర్‌తో భారత్ ప్రతీకార దాడి చేపట్టాక.. పాకిస్తాన్ వరుసగా మూడోరోజు కూడా దుస్సాహసానికి ఒడిగట్టి భంగపడింది. శుక్రవారం అర్ధరాత్రి జమ్మూకశ్మీర్ నుంచి గుజరాత్‌లోని భుజ్ వరకు 26 ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులకు యత్నించింది.
కాగా, పాక్ కుయుక్తులను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. శ్రీనగర్ సహా పలు విమానాశ్రయాలు, సైనిక కేంద్రాలపై పాక్ డ్రోన్లు ప్రయోగించగా.. భారత్ వైమానిక వ్యవస్థ వాటిని నిర్వీర్యం చేసింది. శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్, అవంతీపొరా ఎయిర్‌బేస్ సురక్షితంగా ఉన్నట్లు ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది. డ్రోన్ దాడుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాల్లో బ్లాక్‌అవుట్ కొనసాగించారు. జనం ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
