ఇంటర్నెట్ డెస్క్ : Border 2 First Day Collections | దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన మూవీ ‘బోర్డర్ 2’. ఈ చిత్రం తొలిరోజు కలెక్షన్ల విషయంలో ‘ధురంధర్’(Dhurandhar)ను బీట్ చేసేసింది. శుక్రవారం విడుదలైన ఈ మూవీ భారతీయ బాక్సాఫీసు వద్ద రూ.32 కోట్ల (నెట్) వసూళ్లను రాబట్టింది. అయితే ‘ధురంధర్’ మూవీ తొలిరోజు రూ.28.60 కోట్లు (నెట్) కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే.
Border 2 First Day Collections | ‘బోర్డర్’కు సీక్వెల్‌గా..
‘బోర్డర్ 2’ మూవీ ‘బోర్డర్’కు సీక్వెల్‌గా.. వచ్చింది. ఇందులో సన్నీడియోల్ (Sunny Deol), వరుణ్ ధావన్ (Varun Dhawan), దిల్జీత్ దోసాంజ్ (Diljit Dosanjh), అహాన్ శెట్టి (Ahan Shetty) ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా.. ఈ చిత్రాన్ని అనురాగ్ సింగ్ తెరకెక్కించారు. 1971 ఇండో – పాక్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కించిన ‘బోర్డర్’కు కొనసాగింపుగా విడుదలైంది. అయితే ఈ సీక్వెల్ 28 ఏళ్ల తర్వాత వచ్చినా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది.
Border 2 First Day Collections | త్రిముఖ పోరును కళ్లకు కట్టినట్లు..
‘బోర్డర్ 2’ మూవీ 1971 యుద్ధం తర్వాత జరిగిన మరో కీలకమైన సరిహద్దు పోరాటం చుట్టూ ఉంటుంది. తొలి భాగమైన ‘బోర్డర్’లో ఆర్మీ పోరాటాన్ని మాత్రమే చూపించగా.. సెకండ్ పార్ట్‌లో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ చేసిన త్రిముఖ పోరును ఉద్వేగభరితంగా చూపించారు.
Border 2 First Day Collections | ‘ధురంధర్’ రికార్డు బీట్..
గత డిసెంబర్లో రిలీజైన ‘ధురంధర్’ మూవీ ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా రూ.1300+ కోట్లు రాబట్టింది. అలాగే అత్యధిక వసూలు చేసిన బాలీవుడ్ చిత్రాల జాబితాలో రెండో స్థానం నిలిచింది. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ చిత్రాల్లో నాలుగులో స్థానంలో ఉంది. యాదార్థ ఘటనల ఆధారంగా స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ తెరకెక్కి రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. కాగా.. ఫస్ట్‌డే కలెక్షన్లలో ‘ధురంధర్’ రికార్డును ‘బోర్డర్ 2’ అధిగమించడం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.