Homeబిజినెస్​Borana weaves | లిస్టింగ్‌ గెయిన్స్‌ అందించిన బొరానా వీవ్స్‌.. తొలిరోజే ఒక్కో షేరుపై 18...

Borana weaves | లిస్టింగ్‌ గెయిన్స్‌ అందించిన బొరానా వీవ్స్‌.. తొలిరోజే ఒక్కో షేరుపై 18 శాతం లాభం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Borana weaves | గుజరాత్‌కు చెందిన టెక్స్‌టైల్‌ కంపెనీ బొరానా వీవ్స్‌(Borana weaves) మంగళవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయ్యింది. మార్కెట్లు ప్రతికూలంగా ఉన్నా ఇన్వెస్టర్లను మాత్రం నిరాశపరచలేదు. తొలిరోజే 18 శాతం లాభాలను అందించింది.

బొరానా వీవ్స్‌ కంపెనీ(Borana Weaves Company) మార్కెట్‌నుంచి రూ. 144.89 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవో(IPO)కు వచ్చిన విషయం తెలిసిందే. చిన్న ఈక్విటీ(Small equity) కావడం, రిటైల్‌ కోటా 10 శాతమే కేటాయించడంతో ఈ కంపెనీ సబ్‌స్క్రిప్షన్‌కు భారీ డిమాండ్‌ వచ్చింది. రిటైల్‌ కోటా(Retail quota) 200.5 రెట్లు సబ్‌స్క్రైబ్‌(Subscribe) అయ్యింది. కంపెనీ షేర్లు మంగళవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌ అయ్యాయి. కంపెనీ నిర్ణయించిన షేరు ప్రైస్‌ రూ. 216 కాగా.. 27 రూపాయల ప్రీమియం(Premium)తో 243 వద్ద లిస్టయ్యింది. ఆ తర్వాత రూ. 255 కు చేరి అప్పర్‌ సర్క్యూట్‌(Upper circuit)ను తాకింది. అంటే ఒక్కో షేరుపై తొలిరోజే రూ. 39 లాభం వచ్చిందన్నమాట. ఒక లాట్‌లో 69 షేర్లున్నాయి. అంటే ఐపీవోలో షేర్లు అలాట్‌ అయినవారికి తొలిరోజే ఒక లాట్‌పై రూ. 2,691(18 శాతం) లాభం వచ్చింది.