Homeబిజినెస్​Borana Weaves IPO |ఇన్వెస్టర్ల ముందుకు బొరానా వీవ్స్‌.. లిస్టింగ్‌ రోజు ఎంతలాభం రావొచ్చంటే..

Borana Weaves IPO |ఇన్వెస్టర్ల ముందుకు బొరానా వీవ్స్‌.. లిస్టింగ్‌ రోజు ఎంతలాభం రావొచ్చంటే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Borana Weaves IPO | ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు సద్దుమణుగుతుండడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో ఐపీవో(IPO)ల సందడి మొదలు కాబోతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నెలన్నర గడిచినా ఒక్క మెయిన్‌బోర్డు(Main board) ఐపీవో మాత్రమే వచ్చిన విషయం తెలిసిందే.. తాజాగా రెండో మెయిన్‌బోర్డ్‌ ఐపీవో ఇన్వెస్టర్ల ముందుకు రాబోతోంది. గుజరాత్‌కు చెందిన టెక్స్‌టైల్‌(Textile) తయారీ కంపెనీ అయిన బొరానా వీవ్స్‌.. రూ. 144.89 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు వస్తోంది. దీని సబ్‌స్క్రిప్షన్‌ ఈనెల 20న ప్రారంభం కానుంది. బిడ్లు వేయడానికి 22 వరకు గడువుంది. 27న ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో లిస్ట్‌ కానుంది. 23న రాత్రి అలాట్‌మెంట్‌ వివరాలు ప్రకటించే అవకాశాలున్నాయి.

Borana Weaves IPO | ధరల శ్రేణి..

కంపెనీ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ. 205 నుంచి రూ. 216గా నిర్ణయించింది. ఆసక్తిగలవారు లాట్‌ కోసం బిడ్‌ వేయాల్సి ఉంటుంది. ఒక లాట్‌లో 69 షేర్లుంటాయి. ఒక లాట్‌ కోసం రూ. 14,904 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Borana Weaves IPO | కోటా..

క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్స్‌(QIB) 75 శాతం షేర్లను రిజర్వ్‌ చేసిన బొరానా వీవ్స్‌.. హై నెట్‌వర్క్‌ ఇండివిడ్యువల్‌(HNI) ఇన్వెస్టర్ల కోసం 15 శాతం రిజర్వ్‌ చేసింది. కాగా రిటైల్‌ ఇన్వెస్టర్లకు 10 శాతం కోటానే కేటాయించింది. రిటైల్‌ ఇన్వెస్టర్లకు తక్కువ కోటా ఇవ్వడంతో ఈ ఐపీవోకు భారీ డిమాండ్‌ ఏర్పడే అవకాశాలున్నాయి.

Borana Weaves IPO | ఆర్థిక పరిస్థితి..

బొరానా వీవ్స్‌ ఏటా రెవెన్యూ(Revenue)తోపాటు లాభాలను పెంచుకుంటున్నట్లు ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 135.53 కోట్ల రెవెన్యూతో రూ. 16.30 కోట్ల లాభాలు(Profit) సంపాదించినట్లు పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.199.60 కోట్ల రెవెన్యూ, రూ. 23.59 కోట్ల లాభాలు వచ్చాయని తెలిపింది. గతేడాది సెప్టెంబర్‌ వరకు రెవెన్యూ రూ. 215.71 కోట్లు రాగా.. లాభాలు రూ. 29.31కోట్లకు పెరిగాయని వివరించింది.

Borana Weaves IPO | జీఎంపీ..

గ్రేమార్కెట్‌ ప్రీమియం(GMP) రూ. 63గా ఉంది. అంటే లిస్టింగ్‌ రోజు ఒక్కో షేరుపై 29 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.