అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. జిల్లా కలెక్టరేట్లో మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ సన్నాహక ప్రక్రియలో భాగంగా 2002 ఓటర్ జాబితాలో ప్రస్తుత ఓటర్ జాబితాను మ్యాపింగ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియకు తోడ్పాటు అందిస్తూ ఓటరు జాబితా (voter list) పక్కగా రూపొందేల సహకరించాలని కోరారు. జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లకు నియోజకవర్గస్థాయిలో పోలింగ్ బూత్ ఏజెంట్లను నియమిస్తూ.. బూత్ లెవెల్ ఏజెంట్లను (booth level agents) కూడా ఈ నెల 11లోపు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ అవసరం ఉన్న చోట పోలింగ్ కేంద్రాలను విభజించడం, కొత్త వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాంటి స్టేషన్లను గుర్తిస్తే వాటి వివరాలను తమ దృష్టికి తేవాలని ఆయన సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, విజయేందర్ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
