అక్షరటుడే, గాంధారి : Gandhari | మండలంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నిర్వాహకులు పుస్తకాల దందా చేస్తున్నారు. పాఠశాలలో చదివే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు మొదలు, నోట్‌బుక్కులు, బూట్లు, యూనిఫాంలు, ఇలా అన్నీ తమ వద్దే కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులను వేధిస్తున్నారు.
తాము చెప్పిన ధరకే ఆయా సామగ్రి కొనాలని చెబుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. నర్సరీ విద్యార్థులకు రూ.3వేల పుస్తకాలు ఇస్తున్నారని, ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమని ప్రశ్నిస్తే నచ్చితే పాఠశాలలో చేర్పించండి లేదంటే లేదని ఖరాకండిగా చెబుతున్నట్లు పేర్కొంటున్నారు. ఈ విషయమై ఎంఈవో శ్రీహరిని వివరణ కోరగా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా.. ఎంఈవో పుస్తకాలు అమ్ముతున్న స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.