అక్షరటుడే, ఇందూరు: SR Prime School | నగరంలోని ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో పుస్తకాల గదిని ఎంఈవో సేవాలాల్ (MEO Savalal) సీజ్ చేశారు. పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, యూనిఫాం, టై, బెల్టులు విక్రయిస్తున్నారని ఏబీవీపీ (ABVP) కార్యకర్తలు మంగళవారం స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు.
SR Prime School | విద్యను వ్యాపారం చేశారు..
ఈ సందర్భంగా ఏబీవీపీ ఇందూరు విభాగ్ (ABVP Indore Vibhag) కన్వీనర్ శశిధర్ మాట్లాడుతూ.. జిల్లాలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో విద్యాసామగ్రి పేరుతో వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా విక్రయిస్తున్న యూనిఫామ్, బుక్స్, బెల్టులు తదితర సామగ్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
విద్యను వ్యాపారంగా మారుస్తూ తల్లిదండ్రులకు ఇబ్బందులను గురి చేస్తున్నారని అన్నారు. ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న ఎంఈవో సేవాలాల్ విద్యా సామగ్రి గదిని సీజ్ చేశారు. కార్యక్రమంలో కన్వీనర్ సునీల్, కంఠేశ్వర్ జోనల్ ఇన్ఛార్జి దుర్గాదాస్, శ్రీశాంత్, నవీన్, మున్నా, శివ, సందీప్, యశ్వంత్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.