అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ 45ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై ‘లాయల్టి అండ్ లెగసీ’ (loyalty and legacy) పేరుతో రచించిన పుస్తకాన్ని సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో (Gandhi Bhavan) శనివారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) చేతుల మీదుగా పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎన్నో ఒడిదొడుకుల మధ్య మొదలైన రాజకీయ ప్రస్థానం ఒకే పార్టీలో 45 ఏళ్లుగా కొనసాగుతూ ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో అనేక పదవులను ఆయన అధిరోహించారు. రెండుసార్లు మంత్రి, ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రతిపక్ష నేత (Legislative Council), ప్రభుత్వ సలహాదారుగా నేటి వరకు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఈ పుస్తకంలో పొందుపర్చారు.
Shabbir Ali | షబ్బీర్అలీ బాల్యం నుంచి..
షబ్బీర్ అలీ బాల్యం, విద్యాభ్యాసం మొదలుకొని, విద్యార్థి నాయకుడిగా ఆయన పోషించిన పాత్రను ఈ పుస్తకంలో ప్రస్తావించారు. విద్యార్థిగా ఉన్నప్పటికీ, ప్రజల సమస్యల పట్ల చూపిన చొరవను ఫొటోలతో కలిపి వివరించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సమయంలో ఎదుర్కొన్న కష్టాలు, ఎమ్మెల్యేగా చేసిన సేవలు, మంత్రిగా పోషించిన బాధ్యతలు కూడా ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి.
తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి ఆయన పోరాటాలు, తన పనితీరుతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అంశాలను ఈ పుస్తకంలో రచించినట్లు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. కామారెడ్డి (Kamareddy) మండలం ఉగ్రవాయి శివారులో జరిగిన బాంబుదాడి అనంతరం ఆయన చూపిన ధైర్యం, పట్టుదల, ఆయన ప్రజలతో కలిసే తీరు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్న విధానాన్ని పుస్తకంలో తెలియజేశారు.
షబ్బీర్అలీ విధానాలు, ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేకంగా రైతులకు, లోఓల్టేజ్ సమస్య తీర్చడం వందలాది సబ్ స్టేషన్లు (Substations) ఏర్పాటు చేయడం వంటి అభివృద్ధి అంశాలను సైతం పుస్తకంలో పొందుపర్చినట్లు నాయకులు వివరించారు. సాగునీటి ప్రాజెక్టు కోసం పోరాటం.. ఎస్సారెస్పీ ద్వారా 110కి.మీ నుండి కామారెడ్డి పట్టణానికి తాగునీరు అందించి గొంతు తడపడం, యువతకు, మహిళలకు ఎంతో ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం లాంటి విషయాలను పుస్తకంలో రచించారు.
కామారెడ్డి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన అంశాలను పుస్తకంలో స్పష్టంగా వివరించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
