అక్షరటుడే, కోటగిరి: Pothangal | రైతులకు బోనస్ డబ్బులు చెల్లించడంపై హర్షం వ్యక్తం చేస్తూ పోతంగల్ మండల కేంద్రంలో (Pothangal mandal center) రైతులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్థానిక బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ నాయకుల (Congress party leaders) ఆధ్వర్యంలో మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం రైతులు మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు.. అకాల వర్షం వల్ల రైతన్నలకు సరిగా దిగుబడి రాక ఇబ్బందులు పడుతున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సన్నాలకు బోనస్ ఇవ్వడం హర్షదాయకమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని రైతులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ గైక్వాడ్ హన్మంత్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పుప్పాల శంకర్, యూత్ అధ్యక్షుడు చాంద్ పాషా, మాజీ ఎంపీటీసీ కేశ వీరేశం, విఠల్, సీనియర్ నాయకులు గంధపు పవన్, పుల్కంటి సాయిలు, జుమ్మా ఖాన్, మాణిక్ అప్ప, మన్సూర్, గంధపు రాజు, ధన్రాజ్, దత్తు, గంగాధర్, రాజు, నాగేష్, దిగంబర్, భూమయ్య, భీమ్రావు, రాజు, రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
