అక్షరటుడే, కోటగిరి: Kotagiri | రైతులు పండించిన సన్న వడ్లకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ఉమ్మడి కోటగిరి మండల (Kotagiri mandal) రైతులు ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. గత రబీ సీజన్లో రైతులకు ప్రకటించిన బోనస్‌ను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Kotagiri | ధాన్యం సేకరణ వెంటనే ప్రారంభించాలి
ఈ ఖరీఫ్ సీజన్‌కు (Kharif season) సంబంధించిన ధాన్యం సేకరణ వెంటనే ప్రారంభించాలని.. తరుగు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని రైతులు (Farmers) కోరారు. ఈ ఖరీఫ్ సీజన్లో అకాల వర్షాల కారణంగా ధాన్యం దిగుబడులు సరిగా లేనందున వచ్చిన ధాన్యానికి త్వరగా చెల్లింపులు పూర్తి చేయించాలన్నారు.
ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. రాష్ట్రం మొత్తం మీద ఉన్న సమస్య కావున ప్రభుత్వం ద్వారా ప్రకటించగానే రైతు ఖాతాలో (Farmers Accounts) డబ్బులు జమవుతాయని పేర్కొన్నారు. పీఏసీఎస్ సొసైటీ ద్వారా తరుగు లేకుండా కొనుగోలు చేసే విధంగా చూస్తానన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అందరికీ న్యాయం జరిగే విధంగా చూస్తామని పేర్కొనడంతో రైతులు ధర్నా విరమించారు. అనంతరం రైతులు తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
కార్యక్రమంలో రైతులు వల్లేపల్లి శ్రీనివాస్ రావు, తెల్ల రవికుమార్, ఏముల నవీన్, మోరే కిషన్, పుల్లెల మోహన్ రావు, నవీన్, శంకర్ గౌడ్, కాపుగండ్ల శ్రీనివాస్, దేవేందర్, శ్రీకాంత్, సాయి, శ్రీనివాస్ గౌడ్, కలీం, గంగా ప్రసాద్ గౌడ్, రమేష్, అరవింద్, ఫారుక్, గజేందర్, రైతులు పాల్గొన్నారు.