అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Singareni Bonus | సింగరేణి కార్మికులకు ప్రభుత్వం దసరా బోనస్ (Dussehra bonus) ప్రకటించింది. సచివాలయంలో సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) లాభాల్లో వాటా ప్రకటించారు.
సింగరేణి సంస్థకు గత ఆర్థిక సంవత్సరంలో (Financial year) వచ్చిన లాభాల్లో పెట్టుబడుల కోసం పోను మిగిలిన దానిలో 34 శాతం బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సింగరేణి లాభం రూ.2,360 కోట్ల నుంచి 34 శాతం కార్మికులకు బోనస్ రూపంలో చెల్లిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఒక్కో కార్మికుడికి రూ.1,95,610, కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ ఇస్తామన్నారు. సింగరేణిలో పని చేస్తున్న 41 వేల మంది ఉద్యోగులు (employees), కార్మికులు, 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల్లో వాటా పంచుతామన్నారు. మొత్తం రూ.819 కోట్లు బోనస్ రూపంలో చెల్లిస్తున్నట్లు వెల్లడించారు.
Singareni Bonus | సంస్థను కాపాడుకుంటాం
సింగరేణిని బలోపేతం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆర్థిక సంవత్సరంలో సంస్థకు 6,394 కోట్ల లాభాలు రాగా.. భవిష్యత్ పెట్టుబడుల కోసం రూ.4,034వేల కోట్లు కేటాయించినట్లు సీఎం తెలిపారు. మిగతా రూ.2,360 కోట్లలో 34 శాతం కార్మికులకు పంచుతామని వెల్లడించారు. కాంట్రాక్ట్ కార్మికులకు (contract workers) రూ.5,500 బోనస్ ఇస్తామన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే బోనస్ ఇస్తున్నట్లు వెల్లడించారు. సింగరేణి గనులు (Singareni mines) దేశానికి వెలుగులు ఇస్తున్నాయన్నారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
Singareni Bonus | తెలంగాణ ఆత్మ సింగరేణి
సింగరేణి కార్మికుల పిల్లలకు ఉచిత విద్య వైద్య (free education and medical care) అందిస్తున్నామని భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి సంస్థకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సింగరేణి కాలరీస్‌ను విస్తరించేందుకు చర్యలు చేపడుతామన్నారు. తెలంగాణకు సింగరేణి ఆత్మలాంటిందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో సింగరేణి రెండు కోల్ బ్లాక్స్ కోల్పోయిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సన్నిహితులకు ఆ బ్లాక్‌లు వెళ్లాయని ఆరోపించారు. వాటిని తిరిగి సాధిస్తామని ఆయన పేర్కొన్నారు.
1 comment
[…] సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (Singareni Collieries Company Limited – SCCL) కీలక నిర్ణయం […]
Comments are closed.