అక్షరటుడే, లింగంపేట: Lingampet | మండలంలోని పర్మళ్లలో సోమవారం గ్రామదేవతలకు బోనాలు తీశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి బోనాన్ని అలంకరించి ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. అనంతరం గ్రామ దేవతలకు బోనం నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మంగళవారం గ్రామంలో కుస్తీ పోటీలను నిర్వహించినట్లు గ్రామాభివృద్ధి సభ్యులు తెలిపారు.
