అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | జిల్లాలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి (Devunipally) పోచమ్మగల్లిలో దుర్గాసేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం అమ్మవారికి బోనాలు సమర్పించారు. అమ్మవారి విగ్రహంతో పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు.
దుర్గామాత మండపం నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బోనాలు, అమ్మవారి పల్లకిని ఊరేగించారు. చిన్నారులు ప్రత్యేక వేషధారణతో అలరించారు. ప్రతి ఇంటి వద్ద అమ్మవారి పల్లకీని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, దుర్గామాత దీక్ష పరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.