అక్షరటుడే, ఇందూరు: Gandhi Gunj | నగరంలోని గాంధీ గంజ్లో ఆదివారం బోనాలు నిర్వహిస్తున్న రిటైల్ కూరగాయల వర్తకుల సంఘం (Retail Vegetable Traders Association) పేర్కొంది. ఈ మేరకు ఏఐటీయూసీ (AITUC), వర్తకుల సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ(Market Committee) గ్రేడ్–2 కార్యదర్శి మధుకు వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ.. ఈనెల 20వ తేదీన గంజ్లో రిటైల్ కూరగాయల వర్తకుల సంఘం ఆధ్వర్యంలో బోనాల పండగ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి కండ్లకోయ ప్రసాద్, కోశాధికారి సాయిలు, నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు.