Homeజిల్లాలునిజామాబాద్​Bonalu festival | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు

Bonalu festival | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bonalu festival | తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బోనాలు నిలుస్తాయని ప్రెస్టేజ్​ ఆస్పత్రి (Prestige Hospital) క్రిటికల్​ కేర్​ వైద్యులు ప్రతిమారాజ్ (Prathima Raj)​ పేర్కొన్నారు. నగరంలోని ప్రెస్టేజ్​ ఆస్పత్రిలో సోమవారం బోనాల పండుగను నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆడపడుచులకు తాంబూలం అందజేసి ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతిమరాజ్ మాట్లాడుతూ జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కులు తీర్చుకున్నామని వివరించారు. కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ మహమ్మద్ కైఫ్, మహమూద్, ఇన్​ఛార్జీలు షేక్ మోయిన్, కాశీఫ్​ ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News