ePaper
More
    Homeభక్తిBonalu Festival | గోల్కొండలో మెట్ల బోనాలు ప్రారంభం

    Bonalu Festival | గోల్కొండలో మెట్ల బోనాలు ప్రారంభం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bonalu Festival | హైదరాబాద్​– సికింద్రాబాద్​ జంట నగరాలు బోనాల పండుగకు (Bonalu Festival) సిద్ధం అయ్యాయి. ఆషాఢ మాసంలో హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో పెద్ద ఎత్తున బోనాలు నిర్వహిస్తారు. గురువారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానుంది. దీంతో నెల రోజుల పాటు భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొననుంది.

    Bonalu Festival | గోల్కొండతో ప్రారంభం

    గోల్కొండ (Golconda) కోటలో కొలువైన జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలుత బోనాలు సమర్పిస్తారు. గురువారం నుంచే గోల్కొండ బోనాలు ప్రారంభం అవుతాయి. అయితే జూన్​ 29న ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఇందులో భాగంగా బుధవారం గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారికి మెట్ల బోనాలు, ఒడి బియ్యం సమర్పించారు.

    Bonalu Festival | నగరంలో ఆధ్యాత్మిక సందడి

    బోనాల పండుగతో మహా నగరంలో నెల రోజులపాటు ఆధ్యాత్మిక సందడి నెలకొననుంది. గోల్కొండ, సికింద్రాబాద్​, లాల్‌ దర్వజా, ధూల్‌పేట, బల్కంపేట, పాతబస్తీ, కొత్త బస్తీ అమ్మవారి ఆలయాల్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అంతేగాకుండా నగరంలోని పలు ఆలయాల్లో కూడా భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించుకుంటారు. దీంతో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు.

    More like this

    Revanth meet Nirmala | విద్యా రంగంలో మార్పుల ప్రయత్నానికి మద్దతు ఇవ్వరూ.. నిర్మలా సీతారామన్​ను కోరిన రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌కృషికి...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...