Homeజిల్లాలునిజామాబాద్​Bonalu | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు

Bonalu | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు

బోనాల పండుగ అనేది తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని నిజామాబాద్​ అర్బన్ ఎమ్మెల్యే​ ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నగరంలోని 19వ డివిజన్​ మహాలక్ష్మి ఆలయంలో బోనాల పండుగలో పాల్గొన్నారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Bonalu | తెలంగాణ సంస్కృతికి బోనాలు ప్రతీక అని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్య నారాయణ గుప్తా (Mla Dhanpal) అన్నారు. నగరంలోని 19వ డివిజన్​లోని మహాలక్ష్మి ఆలయంలో (Mahalaxmi Temple) బోనాల పండుగ(Bonala Panduga) నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. బోనాలు ప్రజల ఐకమత్యానికి, భక్తి భావానికి అద్దం పడతాయన్నారు. బోనాల నిర్వహణ ద్వారా సంఘాలు మరింత బలపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు నాగోల్ల రవి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, సాయి, ప్రవీణ్, ప్రసాద్, సాయిరాం, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News