అక్షరటుడే,నిజాంసాగర్: Bonala Festival | మండలంలోని సుల్తాన్‌నగర్ (Sultannagar) గ్రామంలో గురువారం బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బారడి పోచమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా గ్రామం నుంచి బ్యాండ్ మేళాలతో బోనాలను ఊరేగించారు. శుక్రవారం కుస్తీపోటీలు నిర్వహించేందుకు గ్రామంలో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
