Homeజిల్లాలునిజామాబాద్​TNGO's Nizamabad | 15న టీఎన్జీవోస్​ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు

TNGO’s Nizamabad | 15న టీఎన్జీవోస్​ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు

- Advertisement -

అక్షరటుడే ఇందూరు: TNGO’s Nizamabad | టీఎన్జీవోస్ నిజామాబాద్​ ఆధ్వర్యంలో ఈనెల 15న ఆషాఢం బోనాల ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ (Nashetti Suman kumar)​ తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఆదివారం విలేకరులతో సమావేశం నిర్వహించారు.

TNGO’s Nizamabad | ప్రతి ఏడాది ఆషాఢమాసంలో..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో (Ashada masam) బోనాల ఉత్సవాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈనెల 15న పాత కలెక్టరేట్​లోని (Old Collectorate) నవదుర్గా మాత ఆలయ(Navadurga Mata Temple) ప్రాంగణంలో ఉదయం 11 గంటలకు సంబరం నిర్వహిస్తామని వివరించారు. కావున జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్​సోర్సింగ్​ ఉద్యోగులు, నాల్గో తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు, పెన్షనర్లు హాజరుకావాలని కోరారు.

TNGO’s Nizamabad | మహా అన్నప్రసాద కార్యక్రమం..

బోనాల వేడుక అనంతరం మహా అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందని సుమన్​ తెలిపారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, సహాధ్యక్షుడు నారాయణరెడ్డి, టీఎన్జీవో కేంద్ర కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి దినేష్ బాబు, జాఫర్ హుస్సేన్, జాకీర్ హుస్సేన్, మారుతి తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News