అక్షరటుడే, బోధన్: Bonalu Festival | పట్టణంలోని ఉషోదయ డిగ్రీ కళాశాలలో (Ushodaya Degree College) ఆషాఢమాసం (Ashada Masam) సందర్భంగా బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి, బోనాలు నెత్తిన పెట్టుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా డిప్యూటీ డీఎంహెచ్‌వో సరిత (Deputy DMHO Saritha) హాజరై మాట్లాడారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాల పండుగ అని పేర్కొన్నారు. విద్యార్థులకు మన పండుగలపై అవగాహన కలిగేలా బోనాలు ఉత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం అమ్మవారి ఆలయానికి వెళ్లి పూజలు చేసి బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో ఉషోదయ విద్యాసంస్థల డైరెక్టర్ సూర్య ప్రకాష్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్, అధ్యాపకులు పాల్గొన్నారు.