Homeజిల్లాలునిజామాబాద్​Saraswathi Shishu Mandir | సరస్వతి విద్యామందిర్‌లో బోనాల సంబరాలు

Saraswathi Shishu Mandir | సరస్వతి విద్యామందిర్‌లో బోనాల సంబరాలు

- Advertisement -

అక్షరటుడే, భీమ్‌గల్‌: Saraswathi Shishu Mandir | పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యామందిర్‌ ఉన్నత పాఠశాలలో సోమవారం బోనాల వేడుకలు (Bonalu Festival) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోతరాజుల వేషధారణలో, బోనాల ఊరేగింపు నిర్వహించారు. పాఠశాల నుంచి బస్టాండ్‌ మీదుగా పోచమ్మ ఆలయానికి (Poshavva Alayam) చేరుకుని పూజలు చేశారు.

అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రమాదేవి, స్రవంతి, శుభజ, రమ్య, మంజుల, శైలజ, శ్రీజ, భారతి, మనోజ, సంతోషిని, నవనీత, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Must Read
Related News