Srisailam
Srisailam | శ్రీశైలంలో బాంబులు, బుల్లెట్ల కలకలం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Srisailam | ఆంధ్రప్రదేశ్​లోని శ్రీశైలంలో (Srisailam) బాంబులు, బుల్లెట్లు లభ్యం కావడం కలకలం సృష్టించింది. ఆలయం సమీపంలో గల వాసవీ సత్రం (Vasavi Satra) వద్ద ఉన్న ఓ డివైడర్​పై వీటిని గుర్తించారు. సత్రం ముందునుంచి వెళ్తున్న కొందరు స్థానికులు డివైడర్‌ వద్ద ఉన్న సంచిని గమనించారు. దీంతో అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్రీశైలం పోలీసులు (Srisailam police) హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం బాంబు స్క్వాడ్‌ సిబ్బంది పిలిపించి సంచిని తనిఖీ చేయగా అందులో బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. తొమ్మిది పెద్ద బులెట్లు, 4 చిన్న బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. మరో 4 బాంబులను కూడా గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని స్థానిక పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. సంచిలో బుల్లెట్లు ఎవరు వదిలివెళ్లి ఉంటారనే కోణంలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు.