HomeజాతీయంBomb Threat | దేశంలోని పలు ఎయిర్​పోర్టులకు బాంబు బెదిరింపులు

Bomb Threat | దేశంలోని పలు ఎయిర్​పోర్టులకు బాంబు బెదిరింపులు

హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేండ్రం, గోవా ఎయిర్ పోర్టులు పేల్చేస్తామని బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తం అయి విమానాశ్రయాల్లో తనిఖీలు చేపట్టారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bomb Threat | ఢిల్లీ పేలుడు (Delhi blast) ఘటనతో దేశం మొత్తం ఉలిక్కి పడింది. దేశవ్యాప్తంగా అధికారులు, పోలీసులు అలెర్ట్​ అయ్యారు. పలువురు ఉగ్రవాదులను అరెస్ట్​ చేశారు. భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ ఘటన మరువకముందే దేశంలోని పలు విమానాశ్రయాలకు (airports) బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.

దేశంలోని హైదరాబాద్ (Hyderabad), ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేండ్రం, గోవా ఎయిర్ పోర్టులు (Goa airports) పేల్చేస్తామని మెయిల్​ వచ్చింది. ఇండిగో ఎయిర్ లైన్స్, ఎయిర్ ఇండియా ఆఫీసులకు మెయిల్స్​ రావడంతో అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆయా ఎయిర్​పోర్టుల్లో పోలీసులు, సెక్యూరిటీ అధికారులు (police and security officials) బాంబు స్క్వాడ్​తో తనిఖీలు చేపట్టారు. అయితే వారికి ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వారణాసికి వెళ్లే ఎయిర్ ఇండియా విమానానికి (Air India flight) కూడా బెదిరింపు వచ్చింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత బాంబు బెదిరింపును నకిలీగా నిర్ధారించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo Airlines) ఫిర్యాదుల పోర్టల్‌కు మెయిల్ వచ్చిందని తెలిపారు. ఢిల్లీ, చెన్నై, గోవాతో సహా అనేక ఇతర విమానాశ్రయాల గురించి మెయిల్‌లో ప్రస్తావించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ సమాచారాన్ని అనుసరించి, అన్ని ప్రదేశాలలో ముందు జాగ్రత్త తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Bomb Threat | హైదరాబాద్​లో తనిఖీలు

ఎర్రకోట ఘటనతో హైదరాబాద్​ నగర పోలీసులు (Hyderabad city police) అప్రమత్తం అయ్యారు. హైదరాబాద్ వ్యాప్తంగా బాంబ్ స్క్వాడ్​తో తనిఖీలు చేపట్టారు. షాపింగ్ మాల్స్, టెంపుల్స్, బస్టాండ్​లలో తనిఖీలు చేశారు. రద్దీ ప్రదేశాలలో బాంబ్ స్క్వాడ్​తో (bomb squads) తనిఖీలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Must Read
Related News