అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vijay Thalapathy | రాజకీయ నాయకుడిగా మారిన నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్‌కి బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. చెన్నైలోని ఆయన ఇంటి వద్ద బాంబులు పెట్టినట్లు గురువారం బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీసులు ఆయన ఇంటి చుట్టూ భద్రతను పెంచారు.
క్షుణ్ణంగా తనిఖీ చేయగా, ఎటువంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు (Bomb Threat) ఫేక్ అని నిర్ధారించిన పోలీసులు.. అది ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు.
Vijay Thalapathy | భద్రత పెంపు..
కరూర్‌లో జరిగిన విజయ్ ర్యాలీలో తొక్కిసలాటలో జరిగి 41 మంది మరణించిన కొద్ది రోజులకే ఆయన ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. టీవీకే ర్యాలీలో జరిగిన విషాద ఘటన తర్వాత విజయ్‌పై (Vijay Thalapathy) విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ బెదిరింపు వచ్చింది. చెన్నై నీలాంకరైలోని విజయ్ ఇంటి చుట్టూ వద్ద పోలీసులు ముందు జాగ్రత్తగా భద్రతను పెంచారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు తెలిపారు. నకిలీ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనేది కనుగొనడానికి దర్యాప్తు ప్రారంభించారు.
Vijay Thalapathy | తరచూ బాంబు బెదిరింపులు..
బాంబు బెదిరింపులు రావడం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. తమిళనాడు(Tamilnadu)లోని ప్రముఖ వ్యక్తులు, సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల ఇలాంటి బెదిరింపులు ఎక్కువ వచ్చాయి. తాజాగా విజయ్ ఇంటికి కూబా బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అంతకు ముందు గత వారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు కూడా బాంబు బెదిరింపు వచ్చినట్లు తెలిసింది. అలాగే, గవర్నర్ ఆర్ ఎన్ రవి, డీఎంకే ఎంపీ కనిమొళి, నటి త్రిష, హాస్యనటుడు, నటుడు ఎస్ వి శేఖర్‌తో పాటు కమలాలయంలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయానికి, హిందూ వార్త పత్రికకు సైతం ఇటీవల బాంబు బెదిరింపులు వచ్చాయి.