ePaper
More
    HomeజాతీయంBomb threat | తాజ్‌మ‌హాల్‌కు బాంబు బెదిరింపు.. భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేసిన అధికారులు

    Bomb threat | తాజ్‌మ‌హాల్‌కు బాంబు బెదిరింపు.. భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేసిన అధికారులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bomb threat | ఆగ్రాలోని ప్ర‌పంచ ప్ర‌సిద్ధి చెందిన ప‌ర్యాట‌క కేంద్రం తాజ్‌మ‌హాల్‌కు బాంబు బెదిరింపు (Bomb threat) వ‌చ్చింది. తాజ్ మహల్‌ను RDX తో పేల్చివేస్తామని బెదిరింపు ఈ మెయిల్ రావ‌డంతో అధికారులు హై అలర్ట్ (high alert) ప్రకటించారు.

    కేరళ (Kerala) నుంచి ఫోన్ కాల్ వ‌చ్చిన‌ట్లు భావిస్తున్న‌ ఈ బెదిరింపు తర్వాత భద్రతా సంస్థలు అప్రమత్తమ‌య్యాయి. తాజ్‌మ‌హాల్ (Taj Mahal) చుట్టుపక్కల నిఘాను ముమ్మరం చేశాయి. ఈ మెయిల్ (E-Mail) అందిన వెంటనే భారీ భద్రతా ఆపరేషన్‌ను ప్రారంభించారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF), తాజ్ భద్రతా పోలీసులు, బాంబు నిర్వీర్య దళం, డాగ్ స్క్వాడ్, టూరిజం పోలీసులు (Tourism Police), భారత పురావస్తు సర్వే (ASI) అధికారులు దాదాపు మూడు గంటల పాటు తాజ్ మహల్ (Taj Mahal) ప్రాంగణాన్ని క్షుణ్ణంగా త‌నిఖీ చేశారు.

    ప్రధాన గోపురం, మల్లె నేల, మసీదు, తోటలు, కారిడార్‌లతో సహా అన్ని ప్రాంతాలను అడుగడుగునా ప‌రిశీలించారు. తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, అనుమానాస్పద వస్తువులు ఏవీ ల‌భ్యం కాక‌పోవ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు. ఫేక్ బెదిరింపుగా (fake threat) భావించిన అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. కాగా.. పర్యాటకులు పెన్ను తీసుకెళ్లడానికి కూడా అనుమతించ‌ట్లేదు.

    ‘సవ్వకు శంకా’ అనే గుర్తు తెలియని మెయిల్ ఐడీ (email ID named ‘Savvaku Shanka’) నుంచి ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ, ఢిల్లీ పోలీసులకు (Uttar Pradesh Tourism Department and Delhi Police) బెదిరింపు మెయిల్ వ‌చ్చింది. “తాజ్ మహల్‌ను మధ్యాహ్నం 3:30 గంటలకు RDX తో పేల్చివేస్తామని” అందులో పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ముందుజాగ్రత్తగా తాజ్ మహల్ తూర్పు, పశ్చిమ ద్వారాల వద్ద భద్రతను పెంచారు. పెన్నులు తీసుకెళ్లడంపై నిషేధంతో సహా పర్యాటకులపై కూడా ఆంక్షలు విధించారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ మెయిల్ ఫేక్ అని అని తేలింది.

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...