అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Shamshabad Airport | శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి ఈ మెయిల్ పంపించాడు.
బాంబు బెదిరింపు (Bomb threat) మెయిల్ రావడంతో అధికారులు, పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎయిర్ పోర్టు (Airport) మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఆదివారం ఉదయం 6:23 గంటలకు ఎయిర్ పోర్టుకు మెయిల్ వచ్చింది. విమానాశ్రయం సమీపంలో బాంబులు పెట్టినట్లు అందులో ఉంది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఎయిర్ పోర్టుతో పాటు చుట్టు పక్కల తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు లేదని తేల్చారు. ఇది నకిలీ మెయిల్ అని గుర్తించి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Shamshabad Airport | ఫేక్ బెదిరింపులతో ఆందోళన
నకిలీ బాంబు బెదిరింపులతో ప్రజలు, అధికారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో ఇటీవల ఇలాంటి ఘటనలు పెరిగాయి. కోర్టులు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, పాఠశాలల్లో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు సందేశాలు పంపుతున్నారు. అయితే ఇందులో చాలా వరకు నకిలీవే ఉంటున్నాయి. అయితే అధికారులు మాత్రం అప్రమత్తమై తనిఖీలు చేపడుతున్నారు. దీంతో అధికారులు, ప్రజల సమయం వృథా అవుతోంది.
నకిలీ మెయిల్స్, ఫోన్లు చేసే వారిపై అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారు. వాటి సర్వర్లు విదేశాల్లో ఉన్నట్లు సమాచారం. విదేశాల నుంచి కొందరు కావాలనే ఇలాంటి మెయిల్స్ పెడుతున్నట్లు తెలిసింది. ఇటీవల ఢిల్లీ (Delhi), బాంబే (Bombay) హైకోర్టుల్లో బాంబు పెట్టినట్లు మెయిళ్లు వచ్చాయి. దీంతో కోర్టుల కార్యకలాపాలను నిలిపి వేసి తనిఖీలు చేపట్టారు.