అక్షరటుడే, వెబ్‌డెస్క్:Mumbai Airport | ముంబై ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam terror attack) తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన విషయం తెలిసిందే. భారత్ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)తో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ ఘటనలో వంద మంది టెర్రరిస్టులు మృతి చెందారు. ఈ క్రమంలో దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అధికారులు ఇప్పటికే అప్రమత్తంగా ఉంటున్నారు. అయితే బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ వారికి తలనొప్పిగా మారాయి.
తాజాగా మంగళవారం ముంబై ఎయిర్‌పోర్ట్(Mumbai Airport)ను పేల్చివేస్తామంటూ అగంతకుల అధికారులకు ఫోన్ చేశాడు. దీంతో మూడు గంటల పాటు ఎయిర్‌పోర్ట్‌ను అధికారులు తనిఖీ చేశారు. బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఫేక్ కాల్ అని నిర్దారించుకున్నారు. ఆ కాల్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. కాగా ఫేక్ బెదిరింపు కాల్స్‌తో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో బాంబు పెట్టినట్లు దుండగులు ఫోన్, మెయిల్స్ చేస్తున్నారు. అధికారులు గంటల కొద్ది ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. చివరకు ఏమీ లేకపోవడంతో ఫేక్ కాల్(Fake Call) అని చెబుతున్నారు.
ఇలాంటి కాల్స్‌తో ఏది నిజమో, ఏది అబద్దమో తెలియక ప్రతి కాల్ కు అధికారులు స్పందిస్తున్నారు. గంటల తరబడి తనిఖీలు చేపడుతున్నారు. దీంతో సమయం వృథా అవడంతో పాటు ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఫేక్ కాల్స్ చేసే వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.