అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indigo Flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ప్రయాణికులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. జెడ్డా నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు (Shamshabad Airport)కు వస్తున్న విమానంలో బాంబు ఉందని మెయిల్ వచ్చింది.
జెడ్డా నుంచి బయలుదేరిన ఇండిగో విమానం (Indigo Flight)లో బాంబు పెట్టినట్లు మెయిల్ వచ్చింది. దీంతో సెక్యూరిటీ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. శంషాబాద్‌కు రావాల్సిన ఫ్లైట్‌ను ముంబాయి ఎయిర్ పోర్ట్ (Mumbai Airport)కు దారి మళ్లించారు. అనంతరం విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. డాగ్‌స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేసి అది నకిలీ బెదిరింపుగా గుర్తించారు. అనంతరం పోలీసులకు సెక్యూరిటీ అధికారులు ఫిర్యాదు చేశారు.
Indigo Flight | ఫేక్ కాల్స్‌తో ఇబ్బందులు
విమానాలకు ఇటీవల బాంబు బెదిరింపులు వస్తుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో చాలా వరకు ఫేక్ కాల్స్ (Fake calls), మెయిల్స్ ఉంటున్నా.. అధికారులు ముందు జాగ్రత్తగా చర్యలు చేపడుతున్నారు. విమానాలను అత్యవసరంగా ల్యాండ్ చేస్తున్నారు. దీంతో ప్రయాణికుల సమయం వృథా అవుతోంది. తరచుగా బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల విమానాల్లో బాంబులు ఉన్నట్లు బెదిరింపు మెయిల్స్ రావడం.. ఆ తరువాత అదంతా ఫేక్ అని తేలడం జరుగుతూనే ఉంది.
విమానాలతో పాటు కోర్టులు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులకు సైతం బాంబు బెదిరింపులు (Bomb Threats) వస్తున్నాయి. దీంతో అధికారులు తనిఖీలు చేపడతున్నారు. అయితే కొందరు వ్యక్తులు కావాలనే నకిలీ మెయిల్స్ పంపించి అధికారులు, ప్రజల సమయాన్ని వృథా చేస్తున్నారు. ఈ మెయిళ్లు ఎక్కువగా విదేశాల నుంచి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో నిందితులను పట్టుకోవడం వీలు కావడం లేదు. నకిలీ బాంబు బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
