అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hanmakonda | హన్మకొండ కోర్టు (Hanmakonda court)కు బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది. కోర్టులో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తి డయల్ 100కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో పోలీసులు(Police) అప్రమత్తమై కోర్టు ప్రాంగణంలో తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టగా.. ఆరు డిటోనేటర్లు (Detonators) లభ్యమయ్యాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆవరణలో డిటోనేటర్లు దొరకడంతో న్యాయమూర్తులు, లాయర్లు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
