HomeUncategorizedIndigo Flight | విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్​

Indigo Flight | విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indigo Flight | అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన అనంతరం దేశంలో పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయి. దీనికి తోడు పలు ఫ్లైట్​లకు బాంబు బెదిరింపు(Bomb threat) ఫోన్లు వస్తుండడంతో అత్యవసరంగా ల్యాండ్(Emergency landing)​ చేస్తున్నారు. వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటు ఉండడంతో విమానంలో ఎక్కాలంటేనే ప్రయాణికులు భయ పడుతున్నారు.

తాజాగా ఇండిగో విమానానికి(Indigo Flight) బాంబు బెదిరింపు కాల్​ వచ్చింది. కొచ్చి నుంచి ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానం 6E 2706కి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది నాగ్‌పూర్ విమానాశ్రయం(Nagpur Airport)లో అత్యవసరంగా ల్యాండ్​ చేశారు. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్​ చేసిన తర్వాత అందులోని ప్రయాణికులు దింపేశారు. అనంతరం విమానంలో తనిఖీలు చేపట్టారు. అందులో బాంబు లేదని తేల్చారు. ఇది నకిలీ కాల్​ అని అధికారులు తెలిపారు. ఇటీవల థాయ్​లాండ్​ నుంచి భారత్​కు వస్తున్న విమానానికి కూడా బాంబు బెదిరింపు కాల్​ వచ్చిన విషయం తెలిసిందే. ఆగంతకులు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతుండడంతో అధికారులతో పాటు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

Must Read
Related News