ePaper
More
    HomeజాతీయంBSE Office | బీఎస్ఈ కార్యాల‌యానికి బాంబు బెదిరింపు.. త‌నిఖీలు చేపట్టిన పోలీసులు

    BSE Office | బీఎస్ఈ కార్యాల‌యానికి బాంబు బెదిరింపు.. త‌నిఖీలు చేపట్టిన పోలీసులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: BSE Office | ముంబైలోని (Mumbai) బాంబే స్టాక్ ఎక్స్చేంజ్​ కార్యాల‌యానికి మంగళవారం బాంబు బెదిరింపు(Bomb Threat) వచ్చింది. దీంతో వెంటనే బాంబ్ స్క్వాడ్ రంగంలోకి త‌నిఖీలు ప్రారంభించింది. బీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్​కు ఈ మెయిల్ ద్వారా అగంత‌కుల నుంచి బాంబు బెదిరింపు వ‌చ్చింది.

    బాంబే స్టాక్ ఎక్స్చేంజ్​లోని ఫిరోజ్ టవర్ భవనం (Firoz Tower building)లో 4 ఆర్‌డీఎక్స్ ఐఈడీ బాంబులను ఉంచామ‌ని, అవి మధ్యాహ్నం 3 గంటలకు పేలిపోతాయని అగంత‌కులు రెండ్రోజుల క్రితం మెయిల్‌లో హెచ్చ‌రించారు. అయితే, ఆదివారం కార్యాలయం ఆఫీస్ మూసి ఉండ‌డంతో అధికారులు గుర్తించ‌లేదు. అయితే, ఆల‌స్యంగా ఈ మెయిల్‌ను గుర్తించిన ఆఫీస్ సిబ్బంది పోలీసులను సంప్రదించారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది వెంట‌నే పోలీసుల‌కు స‌మాచార‌మిచ్చారు.

    ముంబైలోని రమాబాయి మార్గ్ పోలీస్ స్టేషన్(Ramabai Marg Police Station) లో కేసు నమోదు చేసిన పోలీసులు హుటాహుటిన త‌నిఖీలు నిర్వ‌హించారు. అయితే, అనుమానాస్పద వ‌స్తువులు ల‌భ్యం కాక‌పోవ‌డంతో ఫేక్ కాల్‌గా గుర్తించారు. గ‌తంలోనూ నిందితులు ఇలాంటి బెదిరింపు మెయిల్స్ పంపిన‌ట్లు గుర్తు చేస్తున్నారు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల‌పై బీఎన్‌ఎస్ సెక్షన్లు 351(1)(బి), 353(2), 351(3), 351(4) కింద కేసు నమోదు చేసి, ద‌ర్యాప్తు ప్రారంభించారు. మెయిల్ ఎక్క‌డి నుంచి వ‌చ్చేందనేది ఆరా తీసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...