ePaper
More
    HomeతెలంగాణBegumpet Airport | బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. ముమ్మ‌ర త‌నిఖీలు చేప‌ట్టిన భ‌ద్ర‌తా బ‌ల‌గాలు

    Begumpet Airport | బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. ముమ్మ‌ర త‌నిఖీలు చేప‌ట్టిన భ‌ద్ర‌తా బ‌ల‌గాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Begumpet Airport | హైద‌రాబాద్‌(Hyderabad)లోని పాత విమానాశ్ర‌యం బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు(Bomb Threat) రావ‌డంతో న‌గ‌రంలో క‌ల‌క‌లం రేగింది. బుధ‌వారం ఉదయం 10:30 గంటలకు బేగంపేట్ విమానాశ్రయంలో బాంబు ఉంద‌ని గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్ కాల్ వచ్చింది.

    దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది బాంబ్ స్క్వాడ్‌‌(Bomb Squad)కు, పోలీసుల‌కు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన భ‌ద్ర‌తా బ‌ల‌గాలు(Security forces) ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాయి. ఎయిర్‌పోర్టులోని ఉద్యోగులందరినీ బయటకు పంపించి బాంబు స్క్వాడ్, ఎస్పీఎఫ్ పోలీసులు క్షుణ్ణంగా సోదాలు చేప‌ట్టాయి. అయితే విమానాశ్రయంలో ఎలాంటి బాంబు లేదని, అది ఫేక్ మెయిల్ అని గుర్తించారు. బెదిరింపుల‌కు పాల్ప‌డిన ఆగంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. “ఈ రోజు ఉదయం బేగంపేట విమానాశ్రయానికి(Begumpet Airport) బాంబు బెదిరింపు వచ్చింది. ప్రస్తుతం మేము బాంబు స్క్వాడ్‌తో విమానాశ్రయం, ప‌రిస‌ర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నామ‌ని” బేగంపేట అసిస్టెంట్ పోలీసు కమిషనర్ తెలిపారు.

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...