ePaper
More
    HomeజాతీయంEmergency Landing | ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

    Emergency Landing | ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Emergency Landing | వరుస ఘటనలతో విమానాల్లో ప్రయాణించే వారు ఆందోళన చెందుతున్నారు. గురువారం అహ్మదాబాద్(Ahmedabad)​లో విమానం కూలిపోయి ప్రయాణికులు సహా 265 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్–ఇరాన్​ ఉద్రిక్తతల నేపథ్యంలో పలు విమానాలు రద్దయ్యాయి. ఇరాన్​ తన గగనతలాన్ని మూసివేయడంతో లండన్​ వెళ్తున్న ఎయిర్​ ఇండియా విమానం(Air India plane) ఏకంగా మూడు గంటలు గాలిలోనే ఉండిపోయింది.

    అనంతరం తిరిగి ముంబయి ఎయిర్​పోర్టు(Mumbai Airport)కు చేరుకుంది. తాజాగా మరో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్(Emergency landing)​ అయ్యింది. ఎయిర్‌ ఇండియా AI-379 విమానానికి బాంబు బెదిరింపు(Bomb threat) రావడం తీవ్ర కలకలం రేపింది. థాయ్​లాండ్​లోని పుకెట్‌ నుంచి ఢిల్లీ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. దీంతో అండమాన్ సముద్రంపై కొద్దిసేపు విమానం చక్కర్లు కొట్టింది. అనంతరం అధికారులు థాయిలాండ్‌లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్​ చేశారు. ఈ విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారు. లాండ్​ అయిన తర్వాత ప్రయాణికులను దించేసి విమానంలో బాంబు స్క్వాడ్​ తనిఖీలు చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...