అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Schools | బాంబు బెదిరింపు (Bomb Threat) ఫోన్ కాల్స్‌తో ప్రజలు, పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదో ఒక ప్రాంతంలో బాంబు పెట్టినట్లు ఇటీవల తరుచూ ఫోన్లు వస్తున్నాయి. దీంతో అధికారులు తనిఖీలు (Officers Inspections) చేపడుతున్నారు. అయితే వీటిలో అత్యధికంగా ఫేక్ కాల్స్ ఉంటుండడంతో అధికారులు, ప్రజల సమయం వృథా అవుతోంది. తాజాగా దేశవ్యాప్తంగా 40 పాఠశాలలకు (40 Schools) బాంబు బెదిరింపులు రావడం గమనార్హం.
ఢిల్లీ (Delhi), బెంగళూరు (Bangalore) నగరాల్లోని పలు పాఠశాలలకు శుక్రవారం బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మొదట ఢిల్లీలోని 20 పాఠశాలలకు హెచ్చరికలు వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమై విద్యార్థులను (Students) బయటకు పంపి తనిఖీలు చేపట్టారు.
Schools | బెంగళూరులో..
బెంగళూరులోని పలు పాఠశాలల్లో బాంబులు ఉన్నట్లు ఈమెయిల్స్ రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. బాంబు స్క్వాడ్ బృందాలతో (Bomb Squad Teams) తనిఖీలు చేపట్టారు. అయితే వారికి ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చిన ఐడీ నుంచే బెంగళూరులో కూడా రావడం గమనార్హం.
Schools | సమయం వృథా
బాంబు బెదిరింపుల్లో చాలా వరకు నకిలీవే ఉంటున్నాయి. ఇటీవల ఓ విద్యార్థి పాఠశాలకు సెలవు కోసం బాంబు పెట్టినట్లు ఫోన్ చేశాడు. అలాగే పలువురు ఆకతాయిలు కావాలనే నకిలీ కాల్స్ (Fake Calls) చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి బెదిరింపులతో ప్రజలు, అధికారుల సమయం వృథా అవుతోంది. గతంలో విమానాల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు రావడంతో అత్యవసరంగా ల్యాండ్ చేసిన విషయం తెలిసిందే. నకిలీ బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.