అక్షరటుడే, హైదరాబాద్: Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. దీంతో అధికారులు ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. కాగా, చివరికి మెయిల్ ఫేక్ అని తేలడంతో ఆధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ పరిణామాలతో ప్రయాణికులు ఒకింత అసౌకర్యానికి గురికావాల్సి వచ్చింది.
