అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vijayawada | జమ్మూ కశ్మీర్లో(Jammu KashmiR) పహల్గామ్ ఉగ్రదాడి (PahalgaM terror atack) తర్వాత దేశంలో బాంబు బెదిరింపు ఫోన్‌కాల్స్ పెరిగాయి.
ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)తో భారత్ పాక్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. దీంతో పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారు. అయితే నిత్యం బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్‌తో పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. దేశంలో ఏదో ఒక ప్రాంతంలో బాంబు పెట్టామని ఫోన్, మెయిల్ చేస్తుండటంతో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. తీరా ఏమి దొరకకపోవడంతో ఫేక్ కాల్ అని చెబుతున్నారు.
తాజాగా విజయవాడ(Vijayawada)లోని బీసెంట్ రోడ్డులో beesent road బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చెప్పడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. షాపులను క్లోజ్ చేయించి, బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపడున్నారు.