HomeUncategorizedKerala | తిరువనంతపురం ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

Kerala | తిరువనంతపురం ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Kerala | కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం(Thiruvananthapuram) ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు(Bomb threat) వచ్చింది. ఎయిర్‌పోర్టును బాంబులతో పేల్చివేస్తామని ఓ ఆగంతకుడు ఎయిర్​పోర్టు(Airport)కు మెయిల్​ పంపించాడు. దీంతో భద్రతా సిబ్బంది అలర్ట్​ అయ్యారు. బాంబ్​ స్వ్కాడ్​(Bomb Squad)ను వెంటనే పిలిపించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. టెర్మినల్స్​ సహా ఎయిర్‌పోర్టు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడా బాంబు లేదని నిర్ధారించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు(Police) దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపు మెయిల్‌ పంపిన వ్యక్తిని గుర్తించే పనిలోపడ్డారు.