ePaper
More
    Homeఅంతర్జాతీయంBengaluru Airport | బెంగళూరు ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

    Bengaluru Airport | బెంగళూరు ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bengaluru Airport | బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Kempegowda International Airport) బాంబు బెదిరింపు ఘటన కలకలం రేపింది. ఎయిర్​పోర్ట్​లో రెండు బాంబులు పెట్టినట్లు విమానాశ్రయ భద్రత విభాగానికి గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్​ పెట్టారు. దీంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టారు. విమానాశ్రయం(Bengaluru Airport) అంతటా గాలించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

    Bengaluru Airport | ఆందోళన కలిగిస్తున్న నకిలీ కాల్స్​

    బాంబు బెదిరింపు(Bomb Threat) పేరిట ఫేక్​ కాల్స్​ అధికారులతో పాటు, ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఇలాంటి బెదిరింపు రావడంతో పలు విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్(Emergency Landing)​ చేసిన విషయం తెలిసిందే. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్​లలో బాంబు పెట్టినట్లు బెదిరింపులకు పాల్పడుతుండడంతో అధికారులు అప్రమత్తమై తనిఖీలు చేపడుతున్నారు. అయితే నకిలీ ఫోన్​ కాల్స్​(Fake phone calls)తో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. విమానాలు, రైళ్లు ఆలస్యం అవుతుండడంతో వారి సమయం వృథా అవుతోంది. ఇలా నకిలీ ఫోన్​ కాల్స్​ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...