HomeసినిమాDharmendra | బాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ స్టార్ హీరో ధర్మేంద్ర కన్నుమూత‌!

Dharmendra | బాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ స్టార్ హీరో ధర్మేంద్ర కన్నుమూత‌!

హిందీ సినిమా చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన నటులలో ఒకరైన ధర్మేంద్ర మరణం సినీ పరిశ్రమను విషాదంలో ముంచేసింది. ఐదున్నర దశాబ్దాలపాటు ప్రేక్షకులను అలరించిన ఆయన అనేక హిట్‌ చిత్రాలతో చిరస్థాయిగా గుర్తింపు పొందారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dharmendra | బాలీవుడ్ సినీ పరిశ్రమకు (Bollywood Film Industry) తీరని లోటు ఏర్పడింది. ఒకప్పటి సూపర్ స్టార్ హీరో, హిందీ సినిమాల ‘హీ-మ్యాన్’గా పేరుగాంచిన ధర్మేంద్ర ఇక లేరు.

గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ముంబైలోని (Mumbai) ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయం ఆయన టీమ్ అధికారికంగా ప్రకటించింది. వివరాల ప్రకారం.. ధర్మేంద్రకు (Dharmendra) కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నాయి. ఆరోగ్యం విషమించడంతో ఇటీవల ఆస్పత్రిలో చేరారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆయన.. చివరకు 89 ఏళ్ల వయసులో ప్రాణాలు విడిచారు.

Dharmendra | ప్ర‌యాణం ముగిసింది..

ధర్మేంద్రకు ఇద్ద‌రు భార్యలు ఉన్నారు. వారే ప్రకాశ్ కౌర్, హేమ మాలిని. బాలీవుడ్ హీరోలు సన్నీ డియోల్ మరియు బాబీ డియోల్ ఆయన తొలి భార్య సంతానం. 1958లో దిల్ బీ తేరా హ‌మ్ బీ తేరే సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ధర్మేంద్ర, 60, 70 దశకాల్లో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను శాసించారు. ‘షోలే’, ‘అలీబాబా ఔర్ 40 చోర్’, ‘దోస్త్’, ‘డ్రీమ్ గర్ల్’, ‘సన్నీ’, ‘గాయల్’, ‘లోఫర్’, ‘మేరా నామ్ జోకర్’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తన శక్తివంతమైన నటన, ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో ఆయనను అభిమానులు ప్రేమగా ‘హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్’ అని పిలిచేవారు.

ధర్మేంద్ర మరణంతో సినీ ప్రపంచం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో (Social Media) ఆయనకు నివాళులర్పిస్తున్నారు. “ఒక యుగం ముగిసింది. ధర్మేంద్ర చిరునవ్వు, ఆయన హ్యూమానిటీ ఎప్పటికీ గుర్తుండిపోతాయని పలువురు ప్రముఖులు పోస్టులు చేస్తున్నారు. హిందీ సినీ రంగాన్ని ఐదు దశాబ్దాల పాటు ఏలిన ఈ లెజెండరీ నటుడు ఇక లేరన్న వార్తతో బాలీవుడ్ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.

Dharmendra | ధ‌రేంద్ర ఇంకా చ‌నిపోలేదు..ఆయ‌న కోలుకుంటున్నారంటూ కూతురి స్టేట్‌మెంట్

బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర మరణించారన్న వార్తలు ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఆయన కుమార్తె ఇషా డియోల్ (Esha Deol) స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేశారు…“మీడియా ఓవర్‌డ్రైవ్‌లోకి వెళ్లి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది. నా తండ్రి ఆరోగ్యం స్థిరంగానే ఉంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. మా నాన్న ఆరోగ్యం కోసం ఆందోళన వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు” అని తెలిపారు.

ధ‌రేంద్ర ఇంకా చ‌నిపోలేదు.. కోలుకుంటున్నారంటూ కూతురి స్టేట్‌మెంట్

బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (Dharmendra) మరణించారన్న వార్తలు ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఆయన కుమార్తె ఇషా డియోల్ (Esha Deol) స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేశారు. “నా తండ్రి ఆరోగ్యం స్థిరంగానే ఉంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. మా నాన్న ఆరోగ్యం కోసం ఆందోళన వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు” అని తెలిపారు.

Must Read
Related News