అక్షరటుడే, బాన్సువాడ : Municipal Elections | మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో దొంగ ఓట్లను తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయం (Sub Collector Office) ఎదుట ధర్నా నిర్వహించారు.
Municipal Elections | ఓట్లు వార్డులు దాటిపోయాయి..
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి (Konala Gangareddy) మాట్లాడుతూ.. బాన్సువాడ పట్టణంలోని 9వ వార్డులోని ఓట్లను ఒకటో వార్డులోకి వెళ్లాయన్నారు. అలాగే ఆరో వార్డులో ఏకంగా 400 ఓట్లు పెరిగాయన్నారు. ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు అధికారులు ఇలా ఓట్లను తారుమారు చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నడపాల్సి ఉన్నప్పటికీ అధికారులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు.
Municipal Elections | అవకతవకలపై స్పందించాలి..
ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు బాన్సువాడ మున్సిపాలిటీ (Banswada Municipality) ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలపై ఎన్నికల అధికారులు సమగ్ర సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరమే మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయికి (Sub Collector Kiranmayi) వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు చీదర సాయిలు, నాయకులు శంకర్ గౌడ్, చిరంజీవి, ఉమేష్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ డాకయ్య, మహేష్, రామకృష్ణ, అనిల్, శివశంకర్, శ్రీకాంత్, రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు.