Homeజిల్లాలునిజామాబాద్​Godavari | గోదావరి ఒడ్డున గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

Godavari | గోదావరి ఒడ్డున గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Godavari : నిజామాబాద్​ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్​లో (Pochampadu) గురువారం సాయంత్రం గోదావరి (Godavari) గట్టున గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.

ఎస్సై జాదవ్​ సుహాసిని తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాజెక్ట్ అతిథి గృహం వెనుక గల సమాధి పక్కన గోదావరి అంచున సుమారు 35 సంవత్సరాల వయసు గల మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహంపై గోధుమ రంగు చీర ఉంది.

నాలుగు రోజులుగా గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో నీటి ప్రవాహానికి కొట్టుకువచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Must Read
Related News